దోనకాయలపాడు పోలేరమ్మ తల్లి కి గ్రామస్తుల భక్తి శ్రర్థలతో కొలుపులు నిర్వహించారు. గ్రామంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంధు మిత్రుల రాకతో గ్రామం కళ కళ లాడింది.పోలేరమ్మ కొలుపులను పురష్కరించుకుని గ్రామ టిడిపి నాయకుల ఆహ్వానం మేరకు దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, యూత్ రాష్ట్ర కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, మాజీ అధ్యక్షుడు ఓబులు రెడ్డి, వల్లభనేని నుబ్బయ్య, క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, నల్లపాటి నత్యం, బొడ్డు హనుమా రెడ్డి, మానం గోవిందయ్య తదితరులు పాల్గొన్నారు .
