తూర్పుగంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరధిలో జిల్లా పరిషత్ హైస్కూల్లో సోమవారం డెంగ్యూ, విష జ్వరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పీహెచ్సీ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ డెంగ్యూ జ్వరం సోకిన వారికి వళ్లు నొప్పులు ఎక్కువగా వస్తాయని, నీరసంగా ఉంటుదని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రైడే డ్రై డే పాటించాలని కోరారు. ప్రధానోపాధ్యాయుడు వైఎన్ ఆర్కే ప్రసాద్, హెచ్ఐఓ చంద్రశేఖర్ బాబు, ఎఎన్ఎం ఎం రమణమ్మ, హెచ్ఎ గోపినాయక్, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
