బేగంపేట జులై 29(జే ఎస్ డి ఎం న్యూస్) :
గ్రీన్ హెరిటేజ్ పరిరక్షణలో ట్రాఫిక్ శాఖ మరో ముందడుగు వేసింది.నార్త్ జోన్ ట్రాఫిక్ ఏ సి పి జి శంకర్ రాజు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న పీపల్ చెట్టును రైల్వే అభివృద్ధి పనుల. దృష్ట్యా దెబ్బ తినే అవకాశం ఉండటాన్ని గుర్తించిన ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు రైల్వే అధికారుల అనుమతులతో అదే ప్రాంతం లోని మహబూబ్ కాలేజీలో నాటి పునరుజ్జీవం చేశారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏ సి పి జి.శంకర్ రాజు మాట్లాడుతూ పచ్చ దనాన్ని కాపాడటం,పర్యావరణాన్ని పరిరక్షించడం లో భాగంగానే చెట్టును అక్కడ తొలగించి ఇక్కడ నాటా మని ఆయన అన్నారు.చెట్టును నిరంతరం
పర్యవేక్షిస్తామని శంకర్ రాజు తెలియ జేశారు.




