పంటల భీమా పథకాన్ని రైతులు వినియోగించుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. మండలంలోని రెడ్డి నగర్, వెలుగు వారి పాలెం, బొద్దికూరపాడు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 31తో కంది, నజ్జ, మిరప, మినుము, నువ్వు పంటలకు భీమా చేయించుకోను సమయం ముగుస్తుందని చెప్పారు. కందికి ఎకరానికి రూ.430, నజ్జకు రూ.156, నువ్వులకు రూ.180లు చొప్పున ప్రీమియం చెల్లించి భీమా చేయించుకోవాలని చెప్పారు. విఏఏ ఆదినారాయణ, వి. హెచ్ లు రామ కోటి రెడ్డిలు పాల్గొన్నారు.
