విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టి గురుకుల పాఠశాలల్లో, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్ధులకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఖర్చుచేస్తుందని, పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
పేర్కొన్నారు.
మంగళవారం కంభం మండలం, కందులాపురంలో గల డా. బి ఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో ప్రత్యేకంగా ముట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. వసతి గృహంలో నీటి సమస్య ఉందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్ ఓ వాటర్ నిర్వహణ రూమ్ ను, డార్మెటరీ, టాయిలెట్స్ ను జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు.
ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజు బాలికలకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా లేదా, శుభ్రం చేసే ప్రదేశాలు, బాత్రూములు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉన్నాయా, లేదా, వాటి నిర్వహణ, ఉదయం సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తున్న వేళలు, వసతి గృహ నిర్వాహకుల పనితీరు తదితర అంశాలలో వసతి గృహంలోని బాలికలను, సిబ్బందిని ప్రశ్నించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మెనూను కచితంగా అమలు చేయాలని, అలాగే నాణ్యతతో భోజనం విద్యార్ధులకు అందించడంతో పాటు పరిసరాలు పరిశుభ్రత పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, డ్వామా పిడి జోసెఫ్ కుమార్, తహసిల్దార్ కిరణ్, విద్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


