2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేని సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పి 4 కార్యక్రమానికి శ్రీకారం – జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా

2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేని సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పి 4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
పేర్కొన్నారు.
పి-4(పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్ షిప్) కార్యక్రమం పై అధికారులకు, గ్రామసచివాలయ సిబ్బందికి మార్గదర్శకులకు, అవగాహన కల్పించేందుకు గిద్దలూరు లోని శ్రీ సీతా రామ కల్యాణ మండలంలో ఏర్పాటు చేసిన గిద్దలూరు నియోజక వర్గం అవగాహన సదస్సు లో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా, స్థానిక శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ…. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పి 4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ పీ 4 కార్యక్రమం లక్ష్యం
సమాజంలో ఎవరైతే బాగా ఆర్థికంగా బలంగా ఎదిగారో, వారు అట్టడుగున ఉన్న బడుగు వర్గాలకు సహాయం అందిస్తే అసమానతలు తొలగుతాయి, సమాజంలో సమానత్వం నెలకుంటుంది. ప్రతి ఒక్కరూ వెల్తీ, హెల్దీ, హ్యాపీ ల పౌరులుగా జీవించగలుగుతారు. ఈ ఉద్దేశంతో ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించి ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాల్సిన కుటుంబాలను బంగారు కుటుంబాలుగా, సామర్థ్యం ఉన్నవారిని మార్గదర్శకులుగా గుర్తించి నమోదు చేయడం జరుగుచున్నదన్నారు. ఈ పథకం కింద జిల్లాలో 74,911 బంగారు కుటుంబాలను గుర్తించగా, ఇప్పటి వరకు 34 వేల బంగారు కుటుంబాలను దత్తతు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ పథకం పూర్తిగా వాలంటరీ, అంటే స్వచ్ఛందమే, ఎవరూ ఎవరినీ బలవంతంగా ఇందులో చేర్చడం లేదని తెలిపారు. అలాగే పీ4 పథకంలో పాల్గొంటున్న అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది కూడా దీన్ని స్వచ్ఛంద కార్యక్రమంగానే చూడాలని ఎటువంటి బలవంతం లేకుండా పని చేయాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రాపర్ గా నీడ్ అసెస్మెంట్ సర్వే పక్కాగా చేపట్టడంతో పాటు ఈ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాలను చేపట్టి మార్గదర్శకులను గుర్తించి బంగారు కుటుంబాలతో అనుసంధానం చేపట్టాలన్నారు. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం అయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ… గడిచిన సంవత్సర కాలంగా ప్రధాన మంత్రి గారి సహకారంతో సుపరిపాలన అందించడమే లక్ష్యం గా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారన్నారు. కేవలం సంక్షేమం, అభివృద్ధి చేసినంత మాత్రానా సమాజం ముందుకు పోదని, పేదరిక నిర్మూలనతో పాటు ఆర్థిక అసమానతలు లేని సమాజమే ఏర్పడినప్పుడే రాష్ట్రం అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పి 4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. సమాజంలో ఆర్థికం వృద్ధి చెందిన వ్యక్తులు, సామాజిక పరంగా అట్టడుగు స్థానంలో ఉన్న కుటుంబాలను గుర్తించి సహాయ సహకారాలు అందించి ఆ కుటుంబాలను వృద్ధిలోకి తేవడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ నియోజక వర్గం వెనుకబడిన ప్రాంతమైనప్పటికినీ, ఇటువంటి కార్యక్రమాల్లో ముందుంటున్నారు. నియోజక వర్గంలో 10,879 బంగారు కుటుంబాలను గుర్తించగా, ఇప్పటివరకు 5,868 కుటుంబాలను దత్తతు తీసుకోవడం జరిగిందని, ఇంకా 5,011 కుటుంబాలను దత్తతు తీసుకోవాల్సి ఉందన్నారు. నియోజక వర్గంలో గుర్తించిన బంగారు కుటుంబాలను దత్తతు తీసుకోవడంలో మరియు మార్గదర్శకులను గుర్తించడంలో తన వంతు సహకారం అందించడం జరుగుతుందన్నారు.

తొలుత జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి పి 4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యాన్ని, లక్ష్యాన్ని వివరించగా, పలువురు మార్గదర్శకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ వెంకట సుబ్బయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ బాలయ్య, డ్వామా పిడి జోసెఫ్ కుమార్, ఎస్డిసి సీతారామిరెడ్డి, ఐ సి డి ఎస్ పిడి సువర్ణ ల, నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన మండల అధికారులు, సచివాలయం సిబ్బంది, ఎంపిక చేసిన మార్గదర్శకులు తదితరులు పాల్గొన్నారు.
బాల సదనం ను సందర్శన….
తొలుత జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, గిద్దలూరు లోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల సదనం ను సందర్శించి మౌలిక సదుపాయాలు, వసతులను పరిశీలించి, వివరాలను అడిగితెలుసుకున్నారు. ఈ భవనం చాలా పాతబడి పోయిందని, మరమత్తులు లేదా కొత్త భవనం నిర్మించాల్సిన అవసరం ఉందని బాల సదనం అధికారులు, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, ఐసిడిఎస్ పిడి సువర్ణ, బాలసదనం అధికారి ఝాన్సీ , తహసిల్దార్ ఆంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *