మానవ అక్రమ రవాణా అనేది వ్యవస్థీకృత నేరం అనిజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళాడిగ్రీ కళాశాలలో బుధవారం ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం షరీఫ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా అనేది వ్యవస్థీకృత నేరం అని , ఆ దోపిడీని అంతం చేయడం ఎలా అనే విషయాన్ని విద్యార్థినులకు వివరించారు. అక్రమ రవాణా నిరోధ చట్టం 1956 గురించి,బలవంత మరియు ప్రలోభ అక్రమ రవాణా అనేది నేరము అనే విషయాన్ని పిల్లలకు వివరించడం, వ్యభిచార గృహం నిర్వహణ దానికి సంబంధించిన శిక్షలు గురించి వివరించారు.కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ డి కళ్యాణి మాట్లాడుతూ… పిల్లలు ప్రలోభాల గురికుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వివరించారు. చదువుతో ప్రలోభాలను తెలివిగా ఎలా తప్పించుకోవచ్చు అనే విషయాన్ని కూడా ఉదాహరణ పూర్వకంగా పిల్లలకు వివరించడం జరిగింది . బలహీన, మధ్య మరియు ఉన్నతి వర్గాల పిల్లలు ఏ విధంగా అక్రమ రవాణాకు గురి అవుతున్నారో సోదాహరణంగా ప్రొబిషనరీ అధికారి రత్న ప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల సాధికార మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ పి ఇందిర,బి శ్రావణి , శ్రీనివాసులు తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
