స్వయం సహాయక సంఘాల మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించే లక్ష్యంతో సూక్ష్మరుణ ప్రణాళిక (మైక్రో క్రెడిట్ ప్లాన్), ఏసిఎల్‌పి పథకాలు అమలు చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
పేర్కొన్నారు.
బుధవారం ఒంగోలు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, డిఆర్డి ఏ, వ్యవసాయ, పశు సంవర్ధక, సెరికల్చర్, చేనేత మరియు జౌళి శాఖ, పరిశ్రమలు, ఉద్యాన శాఖ, ఎల్ డి ఎం తదితర శాఖల అధికారులతో సమావేశమై స్వయం సహాయక సంఘాల మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించుటకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించి దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. క్షేత్ర స్థాయిలో స్వయం సహాయక సంఘాల మహిళల జీవన ప్రమాణాలు మేరుగుపర్చేలా, స్థిరమైన జీవనోపాధి కల్పించేలా ఏ ఏ శాఖల లో సబ్సిడీ యూనిట్స్ అమలు చేస్తున్నారో వారికి అవగాహన కల్పించి యూనిట్స్ ను వారికి అందచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా లో మొత్తం 45,297 స్వయం సహాయక సంఘాలు ఉండగా, 4,46,026 మంది సభ్యులు ఉన్నారని, వీరి జీవన ప్రమాణాలు మెరుగు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీరిలో గుర్తించబడిన పి4 కుటుంబాలకు ప్రాధ్యానత ఇస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచేలా యూనిట్ల స్థాపనకు పొదుపు సంఘాల సభ్యులలో అవగాహన కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో చేపట్టాలన్నారు. ప్రభుత్వం వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ, పట్టుశాఖ, పశు సంవర్ధక శాఖ, మత్స్యశాఖ మరియు ఫుడ్ ప్రోసెసింగ్ మొదలగు శాఖలు వారి వార్షిక సుస్ధిర జీవనోపాధులు సంఘ సభ్యుల ద్వారా చేయుటకు సెర్ప్ తో సమన్వయము చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి నారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస రావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస రావు, జిల్లా సెరికల్చర్ అధికారి సంజయకుమార్, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాస రావు, ఎల్దిఎమ్ రమేష్ కుమార్, జిల్లా చేనేత జౌళి శాఖాధికారి , ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ తదితరులు పాల్గొన్నారు.

