వెలుగు వారి పాలెం ప్రాధమిక పాఠశాల (ఎఎ) ను మండల విద్యాశాఖాధికారి – 1 గురజాల సుబ్బయ్య బుధవారం అకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థుల సామర్ధ్యాలను, వర్క్ బుక్స్ను తనిఖీ చేసారు. పాఠశాల రికార్డులను పరిశీలించారు. రెండవ తరగతి విద్యార్థులకు తగని పందెం కథ, కాకి – హంస పాఠ్యాంశం బోధించి విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టారు. శ్రర్థతో చదివిచే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. పాఠశాలను పరిశీలించి పచ్చదనాన్ని ప్రొత్సహిస్తున్న హెచ్ఎం సుబ్బా రెడ్డిని, గ్రీన్ పాన్ పోర్టు అందుకున్న విద్యార్థులను అభినందించారు. ఉపాధ్యాయులు పరకాల మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

