అభివృద్ది,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా శుక్రవారం ఉదయం కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ లో మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటించి మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో మరియు లబ్ధిదారుల ఇంటి వద్దకే పండుగ వాతావరణంలో పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….ఈ రోజు నుంచి రాష్ట్రంలో కొత్తగా లక్షా 8వేల 206 మందికి స్పౌజ్ పింఛన్లు అందిస్తున్నామన్నారు. జిల్లాలో 5 వేల 174 మందికి, కొండపి నియోజక వర్గంలో 799 మందికి, సింగరాయకొండ మండలంలో 157 మందికి, ఈ పంచాయతీ సచివాలయం పరిధిలో 52 మందికి స్పౌజ్ పింఛన్లు ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. స్థానిక ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ నెలలో మూడు హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. 2019 నుంచి నిలిచిపోయిన స్పౌజ్ పింఛన్ల ను ఈ నెల నుంచి ఇస్తున్నామన్నారు. రేపు దర్శిలో ముఖ్యమంత్రి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు హామీ అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం అమలు చేయడం జరుగుచున్నదన్నారు. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పి 4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారన్నారు. పేదప్రజల సంక్షేమం, అభివృద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న, సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మా నాయక్,సి సింగరాయకొండ తహసిల్దార్ పుల్లారావు, ఎం పి డి ఓ కృష్ణారావు, మండల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

