రెడ్ బుక్ రాజ్యాంగంలో వలన ఇబ్బందులు పడ్డ పడుతున్న ప్రతి కార్యకర్తకు బూచేపల్లి కుటుబం అండగా ఉంటుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. ముండ్లమూరు మండలంలో గురువారం వైయస్సార్ సిపి మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైసీపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి మాట్లాడుతూ…. గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను ఎన్నికష్టాలు వచ్చినా తూచ తప్పకుండా పార్టీలకు అతీతంగా అమలు చేసిన ఎకైన సీఎం వైఎస్ జగనన్న అని అన్నారు. నాడు లబ్ధిపొందిన టిడిపి నాయకుడు నేడు వైఎస్సార్ అభిమానులకు ప్రభుత్వ పథకాలు రాకుండా అడ్డుకోవటం దుర్మార్గమైన విషయమని, పచ్చ బిల్ల పెట్టుకున్న వారికి మాత్రమే పథకాలు ఇచ్చే వారు నాడు వెఎస్సార్ ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలు వద్దని చెప్పాల్సిందని అన్నారు. నష్టపోయిన ప్రతి కార్యకర్తకు 2029లో న్యాయం చేస్తామని బూచేపల్లి కుటుంబం హామీ ఇస్తున్నట్లు చెప్పారు. అనేక మంది దర్శి నియోజక వర్గానికి వస్తుంటారు పోతుంటారని.. నియోజక వర్గంలో ప్రతి గడపకు వచ్చేది వారి కష్టాలను తెలుసుకునేది ఒక్క బూచేపల్లి కుటుంబమే అని కార్యకర్తల హర్షధ్యానాల మధ్య చెప్పారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ ………. కమీషన్లకు కక్కుర్తి పడే పడటం బూచేపల్లి కుటుంబ చరిత్రలో లేదని అన్నారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి నుండి నేటి వరకు వారి కుటుంబంతో నడిచామని భవిష్యతో కూడ అలాగే కొనసాగుతుందని అన్నారు. నియోజక వర్గం అభివృద్ధి, సంక్షేమం బూచేపల్లి కుటుంబం. ఎంతో చేసిందని, కార్యకర్తల, ప్రజల అవసరాల కోసం నిత్యం తమ తలుపులు తీసే ఉంటాయని భరోసా ఇచ్చారు.
ఇచ్చిన హామీలను అమలు చేయలేక, జగనన్నకు వస్తున్న జనాధరణ చూడలేక ఆయన పర్యటనపై ఆంక్షలు విధిస్తున్నారని అన్నారు. పొదిలిలో అక్రమంగా కేసులు పెట్టి 40 మందిని వేధించారని, పథకాలు పేర్లు మార్చి తన కుమారుడి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని అన్నారు. వైఎస్సార్సీపి భూస్థాపితం చేస్తామని చెప్పటం హాస్యాస్పదమని, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ప్రజల గుండెల్లో ముద్ర వేసిన వె ఎస్సార్సీపీని ఏమి చెయ్యలేదని ధీమా వ్యక్తం చేసారు. ప్రతి ఇంటికి వెళ్లి బాబు చేసిన మోసాలు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ స్కానర్ను స్కాన్ చేయించి వివరించాలని చెప్పారు. అనంతరం స్కానర్కు విడుదల చేసారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చింతా శ్రీనివాస రెడ్డి, ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మా రెడ్డి, జెడ్పీటీసీ రత్న రాజు, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి మేడికొండ జయంతి, జిల్లా ప్రధాన కార్యదర్శి సూది దేవర అంజయ్య, రైతు సంఘ, యూత్ అధ్యక్షులు బంకా నాగి రెడ్డి, దుగ్గినేని రామక్రిష్ణ, కుమ్మిత అంజి రెడ్డి, పాలడుగు చిరంజీవి, మండల సర్పంచిలు, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.




