బేగంపేట ఆగస్టు 1(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట డివిజన్ పరిధిలోని గురుమూర్తి లేన్ లో సీవరేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని బేగంపేట కార్పొరేటర్ టి మహేశ్వరి శ్రీహరి అన్నారు. శుక్రవారం అధికారులతో కలిసి సివరేజి పనులు జరుగుతున్న గురుమూర్తి లేన్ ను కార్పొరేటర్ సందర్శించారు. ఆరు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన పనుల పురోగతిని ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో ఉన్న సీవ రేజ్ పైప్ లైన్ సామర్థ్యం సరిపోకపోవడంతో తరచూ ఈ ప్రాంతంలో సమస్య తలెత్తుతుందని గుర్తించి పాత లైన్ స్థానంలో కొత్తగా లైన్ వేయిస్తునామన్నారు. వీలైనంత త్వరగా పైప్ లైన్ పనులను పూర్తి చేయాలని ఆమె అధికారులను కోరారు. కార్పొరేటర్ వెంట వాటర్ వర్క్స్ మేనేజర్ రామేశ్వరరావు, బి ఆర్ ఎస్ నాయకులు టి శ్రీహరి, బస్తీ వాసులు ఉన్నారు.


