ఘనంగా మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు జన్మదిన వేడుకలు

మాజీ మంత్రివర్యులు శిద్ధా రాఘవరావు పుట్టినరోజు వేడుకలు మనవడు విహాన్ పుట్టినరోజు వేడుకలు చీమకుర్తి హరిహర క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. గోల్డెన్ గ్రానైట్ మేనేజర్ ఎగిరి ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలను ఏర్పాట్లు మిన్నంటాయి. ఈ సందర్భంగా రాఘవరావు గారికి శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. శిద్ధా రాఘవరావు కి, కుమారుడు సుధీర్ కుమార్ కి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. గోల్డెన్ గ్రానైట్ మేనేజర్ గిరిబాబు, జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ కేకును శిద్ధా రాఘవ రావు దంపతులు కట్ కట్ చేసిన తర్వాత కలువు పూలతో గజమాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల టిడిపి కార్యకర్తలు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోల్డెన్ గ్రానైట్ మేనేజర్ గిరిబాబు, కాట్రగడ్డ రమణయ్య, పోలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చీమకుర్తి భాషా వృద్ధాశ్రమానికి దుప్పట్లు ఎస్కేఆర్ బదిలీలు పారిజాల విద్యార్థులకు కాస్మోటిక్ ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన పథకానికి కూలింగ్ గ్యాస్ ఏడాది ఖర్చు, మున్సిపల్ కార్మికులకు ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మొక్కలు పంపిణీ నోట్ బుక్స్ పంపిణీ మరియు అభిమానులు ఆధ్వర్యంలో దర్శిలో మున్సిపల్ కార్మికులకు అన్నదానం,గొడుగులు పంపిణీ, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు ఉమా మనోవికాస కేంద్రంలో విద్యార్థులకు అన్నదానం, బొమ్మరిల్లు చిన్నారులకు అన్నదానం నిర్వహించారు. చీమకుర్తి పరిసర ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రముఖులు, గ్రానైట్ అధినేతలు,రాఘవరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు పల్లపోతు వెంకటేశ్వర్లు,రావూరి కాశీ గంగా జనార్దన్ రావ, జలదంకి కృష్ణారావు,బొగ్గవరపు సుబ్బారావు,కొత్తూరి శ్రీ రంగనాయకులు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి ఇనుకేపల్లి సురేష్,గునుపూడి భాస్కర్ చలవారి బదరీ నారాయణ,కోట హనుమంతరావు మండల ఆర్యవైశ్య నాయకులు,వాసవి మహిళా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో రాఘవరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు యడ్లపల్లి రామబ్రహ్మం, మద్దిపాడు మార్కెట్ కమిటీ అధ్యక్షులు మన్నం రాజేశ్వరి ప్రసాద్, కందిమల్ల గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *