రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పాటుపడుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో అన్నదాత సుఖీభవ కృతజ్ఞత భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి డా.స్వామి,మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…..రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పాటుపడుతోందని అన్నారు.
విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి దశలోనూ రైతులకు అండగా ఉంటున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతులకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నామని తెలిపారు.రైతులకు సబ్సిడీకి యంత్రాలు, యంత్ర పరికరాలు ఇస్తున్నామని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారని, కనీసం రైతులకు సరైన గోనె సంచులు ఇవ్వలేక చిల్లులు పడ్డ గోనె సంచులు ఇచ్చారని విమర్శించారు. గత 5 ఏళ్లలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.దీనికి కారణం జగన్. జగన్ పబ్లిసిటీ పిచ్చితో పట్టాదారు పాసుపుస్తకాల పైనా తన బొమ్మ వేసుకున్నారని , మేం రాజముద్రతో రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నా మని తెలిపారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటోందని మంత్రి డా.డోలా బాల వీరాంజ నేయస్వామి వివరించారు.



