తాళ్లూరు మండలంలోని నాగంబొట్ల పాలెం, మన్నేపల్లి సొసైటీలకు చైర్మన్లు, డైరెక్టర్లు నియమిస్తూ ఆదివారం జీఓ 641 విడుదల చేస్తూ ఎక్స్ ఆఫిషియో చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేసారు. రాష్ట్రంలో మిగిలిన సొసైటీలకు అన్నింటికి చైర్మన్ లను, డైరెక్టర్లను ఈ జీవోలో నియమిస్తూ పొందు పరచారు. అందులో మన్నేపల్లి సొసైటీ చైర్మన్ గొంది రమణా రెడ్డి (నమర), డైరెక్టర్లు గా కన్నేబోయిన వీరాంజనేయులు, నవులూరి వీర రాఘవులు నియమితులైనారు. నాగంబొట్ల పాలెం సొసైటీ చైర్మన్ వల్లభనేని చిన సుబ్బారావు ఉరఫ్ నుబ్బయ్య, సగిలి కోటి రెడ్డి, బాయి రెడ్డి ఆదినారాయణ లు నియమితులైనారు. పార్టీలో దీర్ఘకాలికంగా సేవలు అందిస్తున్న గొంది రమణా రెడ్డి, వల్లభనేని సుబ్బయ్యలకు చైర్మన్లుగా ఎంపిక కావటం పట్ల వారి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు అవకాశం కల్పించిన అధిష్టానానికి, టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ ల కు వారు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యలను తీరుస్తూ సొసైటీ పరిధిలో రైతుల అభ్యున్నతి కోసం మరింత కృషి చేస్తామని, చైర్మన్ లు, డైరెక్టర్లు తెలిపారు.
తాళ్లూరు మండలంలో రెండు సొసైటీలకు చైర్మన్ లు నియామకం
10
Aug