ఘనంగా మాజీ ఎమ్యెల్యే కదిరి బాబురావు జన్మదిన వేడుకలు

సిఎస్ పురం కదిరి బాబురావు వ్యవసాయ మరియు ఉద్యాన కళాశాలల ఆవరణలో కనిగిరి మాజీ ఎమ్మెల్యే,విశాఖ పార్లమెంట్ వైసీపి పరిశీలకులు కదిరి బాబురావు విద్యాసంస్థల వ్యవస్థాపకులు కదిరి బాబురావు గారి జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపిటిసిలు మునగల నారాయణ రెడ్డి, మూరం కాశిరెడ్డి,లు కేక్ కట్ చేసి కదిరి బాబురావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల ఉద్యాన కళాశాలలు మారుమూల ప్రాంతంలో స్థాపించి అన్నివిధాల అభివృద్ధి చేసి విద్యాపరంగా వసతుల పరంగా ఆధునిక టెక్నాలజీ పరికరాలు అందుబాటులో ఉంచారని అన్నారు.కనిగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసారని కొనియాడారు .భగవంతుని దయతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్నం తిరుపతయ్య, టి బాబురావు, నున్నా నారాయణ,షేక్ నాయబ్ రసూల్, పాశం సురేష్, కదిరి రఘు,షేక్ అహమ్మద్,సుంకరిఅంజనాద్రి,అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *