ముండ్లమూరు మండలంలోని ఉల్లగల్లు ఎస్సీ కాలనీకి చెందిన జొన్నలగడ్డ సామేలు రోడ్డు ప్రమాదంలో గాయాలు అయ్యాయి. సామేలు ఉల్లగల్లు బస్టాండ్ సెంటర్లో వంట సరుకులు తీసుకొని ఎస్సీ కాలనీకి వెళుతుండగా దర్శి అద్దంకి ప్రధాన రహదారిలో బ్రిడ్జి వద్ద మలుపు తిరుగుతుండగా దర్శి వైపు నుండి వస్తున్న కారు వెనుక నుండి ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో సామేలుకు గాయాలు అయ్యాయి. వెంటనే బంధువులు అతనిని గ్రామంలో గల ఆర్ఎంపీ వద్ద చికిత్స కొరకు తీసుకువెళ్లారు.
