ప్రతి ఒక్కరిలో స్వాతంత్రోద్యమ స్పూర్తిని పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా ర్యాలీలను నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు.
ఒంగోలులో సోమవారం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ నెల్లూరు బస్టాండ్, రిమ్స్ మీదుగా మినీ స్టేడియం వరకు సాగింది. అనంతరం అక్కడ తిరంగా ప్రతిజ్క్ష చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ… 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 3వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరిలో స్వాతంత్రోద్యమ స్పూర్తిని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా ర్యాలీల ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీల్లో పాల్గొనాలని ఆమె కోరారు.
ఈ ర్యాలీలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వర కుమార్, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మి ప్రసన్న, డిటిసి సుశీల, జిల్లా విద్యా శాఖాధికారి కిరణ్ కుమార్, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావు, డి ఎస్ డి ఓ రాజేశ్వరి, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పోలీసులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



