రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఇటీవల దర్శి మండలం, తూర్పువీరాయపాలెం గ్రామంలో పర్యటించిన సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సోమవారం సాయంత్రం ఒంగోలు జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, గల్లెపోగు యలమంద, ప్రశాంతి దంపతులకు ఒక లక్షా 50 వేల రూపాయల చెక్కు ను అందచేసారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభోత్సం సందర్భంగా ఈ నెల 2వ తేదీన రాష్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దర్శి మండలం, తూర్పువీరాయపాలెం గ్రామంలో పర్యటించిన నేపధ్యంలో దర్శి పట్టణానికి చెందిన గల్లెపోగు యలమంద, ప్రశాంతి దంపతులు పోలియో కలిగిన 5 సంవత్సరాల తన కుమారుడుతో కలసి ముఖ్యమంత్రి గారిని కలసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని అలాగే తన కుమారునికి సదరం సర్టిఫికేట్ ఇప్పించాలని అర్జీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, గల్లెపోగు యలమంద, ప్రశాంతి దంపతులకు ఒక లక్షా 50 వేల రూపాయల చెక్కు ను అందచేసారు. అలాగే త్వరలో సదరం సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, ఆ దంపతులకు తెలపడం జరిగింది.
