బి సీ ల 42% రిజర్వేషన్లను అడ్డుకుంటున్న బిజెపి.రేపటి బంద్ ను విజయవంతం చేయండి – సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి.కాంపల్లి శ్రీనివాస్.

హైదరాబాద్ అక్టోబర్ 17(జే ఎస్ డి ఎం న్యూస్):
బీసీల న్యాయబద్ధమైన 42 శాతం రిజర్వేషన్లను బిజెపి అడ్డుకుంటుందని బీసీల రిజర్వేషన్ల పట్ల బిజెపి ద్వంద వైఖరిని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో లాల పేట అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సి పి ఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ
బీసీల రిజర్వేషన్లపై బిజెపి డ్రామాలాడుతుందని ఒకవైపు మద్దతు అంటూనే మరోవైపు శాసనసభలో ఆమోదం పొందిన బిల్లులకు ఆమోదం తెలపకుండా బీసీలను మోసం చేస్తుందని అన్నారు.
నేను బీసీ బీసీ అంటూ పదేపదే చెబుతున్న ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణమే పార్లమెంటు సమావేశాలలో 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీలపై బిజెపి అవలంబిస్తున్న ద్వంద వైఖరిని ప్రజలంతా ఎక్కడికక్కడ నిలదీయాలని అన్నారు.
బీసీ బిల్లుకు మద్దతుగా రేపు జరగబోయే బంద్ లో సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో..
సిపిఐ సహాయ కార్యదర్శి కొమురెల్లి బాబు, సయ్యద్ గౌస్, రషీద్, మల్లేష్, వెంకట్ గౌడ్, హుస్సేన్, జహంగీర్, వినయ్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *