బేగంపేట టి టి ఐ లో ట్రాఫిక్ విభాగంలో ఉపయోగించే పరికరాలపై అవగాహన… సందర్శించిన పలు పాఠశాల ల విద్యార్థులు.

బేగంపేట అక్టోబర్ 17(జే ఎస్ డి ఎం న్యూస్) :
పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకోని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (టి టి ఐ) లో ప్రత్యేక అవగహన కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించారు.ట్రాఫిక్ నియమ నిబందనలు,వాటిని పాటించకపోతే విదించే చాలన్ల తో పాటు,ట్రాఫిక్ విభాగంలో ఉపయోగించే పరికరాల పై ప్రత్యేక అవాహన కార్యక్రమాన్ని సికింద్రాబాద్ బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్ స్ట్యూట్ లో నిర్వహించారు.ఈ అవగాహనా కార్యక్రమానికి పలు పాఠశాలల నుంచి వందలాది మంది విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు..
ట్రాఫిక్ సిబ్బంది విద్యార్థులకు వారు వినియోగించే వాహనలు,ట్రాఫిక్ లేజర్ కెమెరాలు ,బాడి కెమెరాలతో పాటు చాలన్ జనరేట్ అయ్యే విధానంను తెలియజేసారు..పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకోని ఉన్నత అధికారుల ఆదేశాలతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమంను నిర్వహించమని టిటిఐ ఎసిపి లక్ష్మణ్ తెలిపారు. ఈ అవగాహనా కార్యక్రమంలో నార్త్ జోన్ ట్రాఫిక్ 1 ఏ సి పి శంకర్ రాజు ఇన్స్పెక్టర్లు,ఎస్సైలు సిబ్బంది,విద్యార్ధినీ ,విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *