కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం కృషి – ఎంపీపీ తాటికొండ

వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి మెరుగైన జీవణాన్ని ఇవ్వటానికి ప్రభుత్వం ప్రతి వారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు.
తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రర్థ తీసుకుంటూ ఆదిశగా కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నట్లు కొనియాడారు. ఎంపీపీడీఓ అజిత, ఎంఈఓ జి సుబ్బయ్య లు కార్యక్రమ ప్రాధాన్యతను వివరించారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైన్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, టిడిపి పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, నాటక రంగ అకాడమి చైర్మన్ ఓబులు రెడ్డి, సొసైటీ చైర్మన్ వల్లభనేని నుబ్బయ్య, నీటి సంఘం ఉపాధ్యక్షుడు తూము శివ నాగి రెడ్డి, పార్టీ రాష్ట్ర యూత్ కార్యదర్శి గొల్లపూడి వేణు బాబు, బెల్లంకొండ వారి పాలెం సర్పంచి పోశం నుమలత శ్రీకాంత్ రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి వెంకట రావు, టిడిపి నాయకులు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, కైపు రామకోటిరెడ్డి, పిన్నిక రమేష్ , విద్యాసాగర్, డిప్యూటి ఎంపీడీఓ నాగమల్లేశ్వరి, గ్రామకార్యదర్శి షేక్ షహనాజ్ బేగం, ఎపీఓ వెంకటేశ్వర్లు, ఎపీఎం దేవరాజ్, వ్యవసాయాధికారి ప్రసాద రావు, పోలీన్ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేసారు. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ రమణా రావు ఆధ్వర్యంలో సిబ్బంది పరనరాలు శుభ్రం చేసారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *