శ్రీశైలం, త్రిపురాంతకం దేవాలయాల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం, ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో బాల త్రిపుర సుందరిదేవి దేవాలయాల్లో మంత్రి స్వామి, కొండపి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు దామచర్ల పూర్ణ చంద్రరావు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు అక్కడ ఆలయ అధికారులు మంత్రికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.దర్శనం అనంతరం మంత్రికి ఆలయ ఈవో స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో బాల త్రిపుర సుందరిదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రిపురాంతకంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, స్థానిక టీడీపీ నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రితో పాటు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.


