పాకల బీచ్ ఫెస్టివల్ పురస్కరించుకొని శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సివి రేణుక శుక్రవారం వెల్లడించారు. సాంఘిక సంక్షేమశాఖా మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి సూచనలు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆదేశాలు మేరకు, ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిఇఒ వెల్లడించారు. ఫెస్టివల్ ఏర్పాట్లు, రాకపోకల దృష్ట్యా విద్యార్థులు, ఉపాధ్యాయుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రకాశం జిల్లాలోని పాఠశాలలకు సెలవు
13
Feb