ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరించాలి- ఎంఈఓ జి సుబ్బయ్య

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య కోరారు. బొద్దికూరపాడు మండల పరిషత్ ఆదర్శ ప్రాధమిక పాఠశాల వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు.
ప్రధానోపాధ్యాయుడు కె సుబ్రమణ్యం అచారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎంఈఓ సుబ్బయ్య, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన ఆవశ్యకతను వక్తలు వివరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బాల కోటయ్య, ఎస్ ఎం సీ చైర్మన్ జి శివా రెడ్డి, కూటమి నాయకులు పోలం రెడ్డి రమణా రెడ్డి, పోలం రెడ్డి క్రిష్ణా రెడ్డి, జెడ్పీ హెచ్ ఎం బ్రహ్మయ్య, రిటైర్డ్ హెచ్ఎం ఎస్ అంజి రెడ్డి, ఉపాధ్యాయులు కరీం, సింగా రెడ్డి, శర్మ, రేవతి, హరిత, విజయ కుమార్, లైబ్రరియన్ పద్మా వతి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *