స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని శనివారం తాళ్లూరు మండలంలో నిర్వహించారు. జలం – జీవం కార్యక్రమంలో బాగంగా ఎన్ ఏ పీ ట్యాంకు వద్ద శుభ్రం చేయించారు. జల వనరులు కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంపీడీఓ అజిత చెప్పారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నిర్వహించారు. ఇరిగేషన్ ఎఈ సుబ్బా రావు, కార్యదర్శి షహనాజ్ బేగం, హౌసింగ్ ఎఈ హనుమంత రావు, టిడిపి మండలపార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు మారం వెంకట రెడ్డి, ఇడమకంటి సుబ్బా రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, అనపర్తి సుబ్బా రావు, సచివాలయ, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.
