కంటోన్మెంట్ ఏప్రిల్ 18 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
ఈనెల 23 వ తేదీన జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున శనివారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ కాంచిపురం యంపీ, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాధన్ పెరుమాళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మదురై జిల్లా మెలూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించినఎన్నికల ప్రచారంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో కలిసి పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు.



