బేగంపేట ఫిబ్రవరి 16
(జేఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట పరిధిలోని శ్యామ్లాల్ బిల్డింగ్ సత్య కృష్ణ సిరిసంపద అపార్ట్మెంట్లో ఎం. అనురాధ అనే మహిళ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది.అపార్ట్మెంట్ లో
ఈ భారీ చోరీ జరగడం అపార్ట్మెంట్ వాసులను నివ్వెరపర్చింది. సత్య కృష్ణ సిరి సంపద అపార్ట్మెంట్లోని మూడవ అంతస్తు 302 ప్లాట్ లో అనురాధ అనే మహిళ నివసిస్తుంది. ఆమె మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కవాడిగూడ లో నివసిస్తున్న తన కుమార్తె వద్దకు వెళ్ళింది.అయితే సోమవారం ఉదయం ఆమె ఇంట్లో పని చేసేందుకు పని మనిషి ఇంటికి వచ్చింది.ఈ సమయంలో బయట తాళాలు తీసి ఉండటం గమనించింది. వెంటనే ఈ విషయాన్నియజమానురాలైన అనురాధకు సమాచారం ఇచ్చింది. ఆమె వెంటనే తన ప్లాట్ కు చేరుకొని పరిశీలించగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటం, ఇంట్లోనీ వస్తువులు చిందరవందరగా పడి ఉండటం గమనించింది. ఇంట్లో ఉన్న బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదును పరిశీలించగా సుమారు 30 తులాల బంగారం 60 వేల నగదు చోరీకి గురైనట్లు ఆమె గుర్తించింది. ఇదే సమయంలో వెండి కూడా పోయినట్లు ఆమె పేర్కొంది. ఇదే విషయాన్ని బాధితురాలు బేగంపేట పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనం జరిగిన అపార్ట్మెంట్ నుపరిశీలించారు. బాధితురాలు అనురాధ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు
చేశారు.బేగంపేట ఏ సి పి గోపాలకృష్ణ మూర్తి,ఇన్స్పెక్టర్ సైదులు అపార్ట్మెంట్ కు చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.క్లూస్ టీమ్ కు సమాచారం ఇచ్చి ఆధారాలు సేకరించారు. అపార్ట్మెంట్ వద్ద ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. నిందితులు ఎటువైపు నుంచి అపార్ట్మెంట్లో ప్రవేశించారు బయటకు ఎలా వెళ్లారు అన్న విషయాలు పరిశీలించారు. ఇన్స్పెక్టర్ సైదులు మాట్లాడుతూ బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుల కదలికలనుతెలుసుకునేందుకు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామన్నారు.వీలైనంత త్వరగా నిందితులనుపట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
అపార్ట్మెంట్ వాసులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి…. ఏ సి పి గోపాల కృష్ణమూర్తి.
అపార్ట్మెంట్ వాసులు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని దొంగతనాల నుంచి రక్షణ పొందాలని బేగంపేట ఏసిపి గోపాలకృష్ణమూర్తి సూచించారు.ప్రధాన ద్వారానికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.ముఖ్యంగా సి సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలనిసూచించారు.
ఎక్కువ రోజులు బయటకు వెళ్లాల్సివస్తే పక్కింటి వారికి సెక్యూరిటీ కి ముందుగా సమాచారం ఇస్తే
మంచిదన్నారు.న్యూస్ పేపర్లు వేసేవారు,పార్సిల్స్,గార్బేజ్ వారికి అనుమతి ఇవ్వకూడదన్నారు.స్పేర్ తాళాలు ఇంటి బయట పెట్టకూడదన్నారు.సోషల్ మీడియాలో తాము ఎక్కడ ఉన్నాయో అన్న వివరాలు షేర్ చేయకూడదన్నారు.ఏమైనా ఖరీదైన వస్తువులు ఉంటే ఇంట్లో ఎక్కడ బడితే అక్కడ పెట్టకుండా లాకర్లలో భద్రపరచుకోవాలన్నారు.అపార్ట్మెంట్ లోకి వచ్చే విజిటర్స్ వివరాలను తప్పకుండా మెయిన్ గేట్ సెక్యూరిటీ వద్ద రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు.అలాగే అసోసియేషన్ సభ్యులు తప్పకుండా సెక్యూరిటీ కి నిబంధనలు పాటించేలా చూడాలని,సహకరించాలని అన్నారు.తమ వాహనాలను కూడా రక్షిత ప్రదేశంలో పార్కింగ్ చేసుకోవాలన్నారు.ఎవరైనా అనుమానితవ్యక్తులు,అనుమానిత వస్తువులను గుర్తిస్తే వెంటనే సమాచారాన్ని స్తానిక పోలీస్ లకు తెలియ జేయాలన్నారు.అలాగే అన్ని లిఫ్ట్ ల వద్ద
పోలీస్ ,అగ్నిమాపక,108,
ముఖ్యమైన ఫోన్ నంబర్ల అందుబాటులో ఉంచాలనీ
ఏ సి పి సూచించారు.




