కళాశాల విద్యార్థిని ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్ కి మూడు రోజుల జైలు శిక్ష .. …….

బేగంపేట ఫిబ్రవరి 18
(జే ఎస్ డి ఎం న్యూస్) :
కళాశాల విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్ కు మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు బేగంపేట ఇన్స్పెక్టర్ సైదులు తెలియజేశారు.చార్మినార్ కు చెందిన ఆటో డ్రైవర్ మహామ్మద్ అఖిల్ (56) కు
3 రోజుల జైలు శిక్ష విధించారు.తనని ఎవరూ చూడటం లేదు అనే భ్రమలో ఉండే ఇలాంటి వారిపైన పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సి సి టి వి లు , షీ టీం బృందాలు నిత్యం పహారా చేస్తూనే ఉంటాయని,బహిరంగ ప్రదేశాల్లో తప్పుడు పనులు చేస్తే , భవిష్యత్తులో శిక్షలు తప్పవు అని బేగంపేట ఎస్ హెచ్ ఓ సైదులు తెలియ జేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *