కంటోన్మెంట్ ఫిబ్రవరి 21
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రభుత్వం మహిళలకు అమలుచేసే పథకాలు కంటోన్మెంట్ మహిళా సోదరీమణులకు అందించడమే లక్ష్యం.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు .రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఎన్నో పథకాలను అమలు చేస్తుందని, ఆ పథకాలలో కంటోన్మెంట్ మహిళలు
కూడా కోటీశ్వరులు కావాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ శనివారం పికెట్ లోని తన క్యాంపు కార్యాలయంలో మెప్మా అధికారులతో సమీక్ష నిర్వహించారు . మహిళా సంఘాలకు బ్యాంకు ఋణాల పట్ల అవగాహన కల్పించాలని, అవసరమైతే బ్యాంకుల అధికారులతో తాను కూడా సమన్వయం చేస్తానని అన్నారు.ప్రభుత్వ పథకాల పట్ల మహిళాసోదరీమణులకు అవగాహన కల్పించి, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చి దిద్దాలని, దీనికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని, మహిళలు ఆర్ధికంగా బలపడినప్పుడే కుటుంబాలు బాగుంటాయని, తద్వారా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని, దీనికి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమీక్షలో మెప్మా టౌన్ మిషన్ కో ఆర్డినేటర్ ప్రకాష్, కమ్యూనిటీ ఆర్గనైజర్ ఉషారాణి,డాటా ఎంట్రీ ఆపరేటర్ రోజ్ లిన్ లు పాల్గొన్నారు.

