కంటోన్మెంట్ ఏప్రిల్ 15
(జే ఎస్ డి ఎం న్యూస్) :
కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతంపై బుధవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ లను ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నియోజకవర్గ అభివృద్ధికి అధికంగా నిధులు కేటాయించడానికిఅధికారులకు తగిన ఆదేశాలు ఇస్తానని అన్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతానికి ఇరువురు నేతలు ఎమ్మెల్యేతో సుదీర్ఘంగా చర్చించారన్నారు.
