లిటిల్ బేగంపేట (ప్రకాశంనగర్)లో రోడ్డు ఆక్రమణలను కూల్చి వేసిన జీ హెచ్ ఎం సి,హైడ్రా.బీజేపీ పోరాటం ఫలితం.మర్రి ,నెమలి ఆనంద్ లకు కాలనీ వాసుల కృతజ్ఞతలు.

బేగంపేట ఫిబ్రవరి 25
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రకాశ్‌నగర్‌లోని లిటిల్ బేగంపేట కాలనీ ఉత్తర దిశ రోడ్డునుకొందరుఆక్రమణదారులు అక్రమంగా ఆక్రమించి రూఫ్ షెడ్‌లు నిర్మించి కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు.ఈ విషయాన్ని కాలనీ వాసులు బీ జే పి నాయకులు నెమలి ఆనంద్ (నందు) దృష్టికి తీసుకెళ్లడం.ఆయన ఈ విషయాన్ని బీ జె పి జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే కాలనీ లో ఆక్రమణకు గురైన రోడ్డు స్థలాన్ని పరిశీలించారు.వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు.స్పందించిన అధికారులు బుధవారం పోలీసులతో కలసి రోడ్డు ఆక్రమణకు గురైన ప్రాంతానికి చేరుకుని అక్రమంగా నిర్మించిన కట్టడాలను పూర్తిగా నేల మట్టం చేశారు. నెలల తరబడి అధికారుల వద్ద తిరిగినా స్పందన లేక కాలనీ ప్రజలు తీవ్ర ఆందోళనకుగురయ్యారు. నెమలి ఆనంద్ ఫిబ్రవరి 5 న మర్రి శశిధర్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు.
కాలనీ వాసుల తరఫున మర్రి శశిధర్ రెడ్డి అధికారులను నిలదీయడంతో పాటు, తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. దీంతో నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఫైల్ కదిలి, జీ హెచ్ ఎం సి అధికారులు జి ఓ ఎం ఎస్ 191 ప్రకారం డిమాలిషన్ ఆర్డర్ జారీ చేశారు. దీంతో బుధవారం జి హెచ్ ఎం సి,హైడ్రా యంత్రాంగం భారీ యంత్రాలతో రంగంలోకి దిగి అక్రమకట్టడాలనుకూల్చివేసింది.ఇంతకాలం నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వ యంత్రాంగం, బీజేపీ జోక్యంతో కదిలింది. ఈ సందర్భంగా సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ (నందు) మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం బీజేపీ ఎప్పుడూ ముందుంటుందని ఈ ఘటన మరోసారినిరూపించిందన్నారు
ఈ సమస్యపై సకాలంలో స్పందించిన జీ హెచ్ ఎం సి ,హైడ్రా ,పోలీస్ అధికారులకు ఆనంద్ కృతజ్ఞతలు తెలియ జేశారు.లిటిల్ బేగంపేట కాలనీ వాసులు మర్రి శశిధర్ రెడ్డి , నెమలి ఆనంద్ (నందు) లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే రోడ్డును త్వరితగతిన పునరుద్ధరించాలని మర్రి శశిధర్ రెడ్డి గారి ద్వారా మున్సిపల్ కార్పొరేషన్‌కు కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *