సనత్ నగర్ ఏప్రిల్ 20
(జే ఎస్ డి ఎం న్యూస్)
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సికింద్రాబాద్ జిల్లా ఎస్సార్ నగర్ శాఖ ఆధ్వర్యంలో ‘వందేమాతరం ఆన్ క్యాంపస్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. వందేమాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సనత్ నగర్లోని హిందూ పబ్లిక్ స్కూల్లో సుమారు 1800 మంది విద్యార్థులతో సామూహిక వందేమాతర గీతాలాపన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ.. మనకు స్వేచ్ఛ, విద్య, అవకాశాలను అందించిన మాతృభూమిని గౌరవంగా నమస్కరించుకునే నినాదమే వందేమాతరం అని కొనియాడారు. ప్రపంచంలోనే దేశాన్ని తల్లిగా భావించే గొప్ప సంస్కృతి కేవలం భారతదేశానికే సొంతమని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో ఈ నినాదం ప్రజల్లో ధైర్యాన్ని, ఐక్యతను మరియు దేశభక్తిని నింపిందని, ఎందరో మహానుభావులు వందేమాతర గేయంతోనే తమ పోరాట పటిమను చాటారని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాధిక, ఏబీవీపీ కూకట్పల్లి విభాగ్ కన్వీనర్ రేగోడ్ నాగేష్, సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చేర్క బాలకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌతమ్, సిటీ ఎస్ఎఫ్డీ కన్వీనర్ పాండుతో పాటు సిద్ధు, రాడ్ని, రామ్మోహన్, హర్ష, రాము తదితర కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థుల గీతాలాపనతో పాఠశాల ప్రాంగణం దేశభక్తి స్ఫూర్తితో మార్మోగింది.


