బేగంపేట ,ఏప్రిల్ 28, (జే ఎస్ డి ఎం న్యూస్) : బేగంపేట పరిధిలో బ్లాక్ ఫిలిం వేసిన కార్లపై ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అద్దాలకు బ్లాక్ ఫిలిం వేసిన కార్లను గుర్తించి ఫిలిం తొలగించారు.
మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మల్కాజ్‌గిరి ట్రాఫిక్-I డిసిపి కె. రాహుల్ రెడ్డి సూచనలతో మంగళవారం బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్కాజ్ గిరి అదనపు డిసిపి షాకీర్ హుస్సేన్, తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. అధిక శబ్ద కాలుష్యం కలిగిన సైలెన్సర్ల,నంబర్ ప్లేట్ ఉల్లంఘన, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనం నడపడం ట్రాఫిక్ వంటి వివిధ ఉల్లంఘనల పై బేగంపేట ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మల్కాజ్‌గిరి కమిషనరేట్ బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి ముఖ్య ప్రాంతాలలో వాహనదారులు, ప్రజల భద్రత చర్యలలో భాగంగా హెచ్‌పిఎస్ అవుట్‌గేట్, రసూల్‌పురా, సిటిఓ జంక్షన్, బోయిన్ పల్లి వద్ద టింటెడ్ గ్లాస్/బ్లాక్ ఫిల్మ్‌పై ఈ ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టారు.ఈ సందర్భంగా టింటెడ్ గ్లాస్/బ్లాక్ ఫిల్మ్ కలిగి వున్న 150 వాహన యజమానులపై కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు. ఈ తనిఖీల్లో బేగంపేట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి.జానకి రాముడు, సబ్ ఇన్స్పెక్టర్లు ఇ. హరీష్ గౌడ్, శివరాజ్, అశోక్ రెడ్డి, దేవిదాస్, సతీష్, ట్రాఫిక్ కానిస్టేబుల్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

