బేగంపేట ఏప్రిల్ 29 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
అందరితో ఎంతో కలివిడిగా వుండే అరుణ్ కుమార్ అకాల మరణం చెందడం జీర్ణించుకోలేక పోతున్నామని ,బేగంపేట మాజీ కార్పొరేటర్ ఉప్పల తరుణి నాయి అన్నారు.అరుణ్ కుమార్ జయంతి నీ పురస్కరించుకుని ఫోటోకు పూల మాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఓల్డ్ కస్టమ్స్ బస్తీ లోని ప్రభుత్వ పాఠశాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు డి.వి.నరేందర్ రావు, హనుమాన్ టెంపుల్ చైర్మన్ మహేందర్ , శ్రీనివాస్ నాయీ , శంషాబాద్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ అజయ్ , టీంకు, ప్రవీణ్, అజయ్, అంబేద్కర్, పున్నం, సాయి, సుశాంత్, రాహుల్, మనీష్, ఆదర్శ్, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.
