బేగంపేట, బోయిన్ పల్లి పరిధిలోని పలు పెట్రోల్ పంపులను తనిఖీ చేసిన బేగంపేట ఎసిపి ఏసిపి గోపాలకృష్ణమూర్తి.
బేగంపేట ఏప్రిల్ 29
(జే ఎస్ డి ఎం న్యూస్)
నగరంలో కృత్రిమ ఇంధన కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బేగంపేట ఏసిపి గోపాలకృష్ణమూర్తి బుధవారం బేగంపేట బోయిన్ పల్లి పరిధిలోని పలు పెట్రోల్ బంకులను స్వయంగా పరిశీలించి నిల్వలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను కొందరు పెట్రోల్ పంపులు యజమానులు తమకు అనుకూలంగా మార్చుకుంటూ సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో బుధవారం బోయిన్‌పల్లి, బేగంపేట ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులను సిబ్బందితో కలసి తనిఖీ చేశామన్నారు. బోయిన్ పల్లి పరిధిలోని పెట్రోలు పంపుల పై వాహనదారులు ఫిర్యాదు చేయడంతో బోయిన్ పల్లి ఇన్ స్పెక్టర్ తిరుపతి రాజు తో కలసి పంపులను ఆకస్మికంగా తనిఖీ చేశామన్నాడు. ఈ సందర్భంగా పంపుల యజమానులకు పలు సూచనలు చేశామన్నారు. పంపుల్లో స్టాక్ లభ్యత, సరఫరా విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిల్వళ వివరాలను ఎప్పటికప్పుడు కచ్చితంగా బోర్డు ల పై నమోదు చేయాల్సి ఉందని ఎసిపి హెచ్చరించారు.గతంలో రెండు రోజుల పాటు వచ్చే నిల్వలు, ప్రస్తుతం వినియోగదారులు అధిక మొత్తంలో కొనుగోలు చేస్తుండటంతో కొద్ది గంటల్లోనే ఖాళీ అవుతున్నాయని యాజమాన్యాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. అయితే స్టాక్ ఉండి కూడా కావాలని సరఫరా నిలిపివేస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు. ఇకపై సివిల్ సప్లైస్, రెవెన్యూ శాఖలతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తామని, ‘నో స్టాక్’ బోర్డులు పెట్టిన బంకులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా అవకతవకలు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఏ సిపి వెంట బోయిన్ పల్లి ఇన్స్పెక్టర్ సిబ్బంది పాల్గొన్నారు .


