బేగంపేట, మే 3,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మోడీ సభను విజయవంతం చేయాలనీ బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం బేగంపేట మోతిలాల్ నెహ్రూ లోని మర్రి కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గం బిజెపి నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ సభకు సనత్ నగర్ నియోజకవర్గము నుండి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని , సభను జయప్రదం చేయాలని కోరారు.ఈ నెల 10 వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరగబోయే నరేంద్ర మోడీ సభను జయప్రదం చేయాలని బిజెపి శ్రేణులకు సూచించారు.
నరేంద్ర మోడీ మూడవసారి ప్రధాన మంత్రి అయిన తరువాత మొదటి సారి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారని, ముందుగా వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని, తరువాత భారీ బహిరంగ సభ వుంటుందని , కాబట్టి సనత్ నగర్ నియోజకవర్గము నుండి అత్యధిక సంఖ్యలో పాల్గొని నరేంద్ర మోడీ ఘనంగా స్వాగతం పలికి సభను జయప్రదం చేయాలని కొరారు.ఈ కార్యక్రమంలో మర్రి శశిధర్ రెడ్డి తో పాటు మహంకాళి సికింద్రాబాద్ జిల్లా కార్యదర్శి సాలాద్రి శ్రీనివాస్ యాదవ్, జిల్లా ఓ బి సి ప్రధాన కార్యదర్శి సి. విజయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు యం. మహేష్ కుమార్ ముదిరాజ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి తారకంపేట శ్రవణ్ కుమార్, సంధ్య లక్ష్మి , లోహిత్ తదితరులు పాల్గొన్నారు.

