కంటోన్మెంట్ మే 5,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. మార్కెట్ డివిజన్ వెస్ట్ మారేడ్ పల్లిలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంగళవారం ప్రారంభించారు. సాయి సాత్విక్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్‌ను అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు మహిళా సంఘాలకు ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందనిపేర్కొన్నారు.
మహిళలు ఆర్ధికంగా బలపడాలనే ఉద్దేశంతో
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుందని చెప్పారు. క్యాంటిన్ ఏర్పాటు చేసిన మహిళా సంఘ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట బోయిన్ పల్లి సర్కిల్ డి సి డాకూనాయక్, మెప్మా కో ఆర్డినేటర్ యాదయ్య, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సుధాకర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, వైష్ణవి యాదవ్, ధనలక్ష్మి, శేఖర్ ముదిరాజ్, శ్రీనాధ్, రషీద్ తదితరులు పాల్గొన్నారు .


