హైదరాబాద్ మే 5, (జే ఎస్ డి ఎం న్యూస్) :
మైనారిటీస్ గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందికి పిఎఫ్, ఈఎస్ఐ, హెల్త్ కార్డుల సౌకర్యాలు కల్పించడంతో పాటు నిబంధనల ప్రకారం వేతనాలు పెంచాలని కోరుతూ సిబ్బంది పెద్ద ఎత్తున సీఎం ప్రజావాణికి వచ్చి ఇంచార్జ్ డాక్టర్ జీ.చిన్నారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు.మంగళవారం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో జరిగిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మైనార్టీ గురుకుల పాఠశాలల నాన్ టీచింగ్ సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం చిన్నారెడ్డిని విజ్ఞప్తి చేయగా సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం చిన్నారెడ్డి కృషి చేశారు.
