హైదరాబాద్ మే 5,(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 35 మంది పట్టభద్రులకు నార్వే దేశానికి వర్క్ వీసా మీద ఉపాధిని కల్పిస్తానని చెప్పి ఐ బుక్ అనే ప్రైవేట్ కన్సల్టెన్సీ మోసం చేసిందని బాధితులు మంగళవారం సీఎం ప్రవాసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రవాసి ప్రజావాణి సమన్వయకర్త బొజ్జా అమరేందర్ రెడ్డి ఈ ఫిర్యాదును కూలంకషంగా పరిశీలించి సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఎండార్స్ మెంట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని, సమగ్ర విచారణ జరపాలని సూచించారు.ఐ బుక్ కన్సల్టెంట్ ఒక్కొక్కరి నుంచి ఐదు లక్షల రూపాయల చొప్పున వసూలు చేశారని, నకిలీ వర్క్ పర్మిట్, నకిలీ నార్వే వీసా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారని, తాము మోసపోయామని అర్థం చేసుకున్న తర్వాత కెపిహెచ్బి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎఫ్ ఐ ఆర్ నమోదు అయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు
నార్వే వర్క్ వీసా ఇప్పిస్తానని చెప్పి 35 మందికి మోసం చేసిన ప్రైవేట్ కన్సల్టెన్సీ .విచారణకు ఆదేశించిన సీఎం ప్రజావాణి ఇంచార్జ్ చిన్నారెడ్డి
05
May