రాంగోపాల్‌పేటలో బీజేపీ సంబరాలు.పశ్చిమ బెంగాల్, అస్సాం విజయకేతనంపై మోదీ చిత్రపటానికి చీరె సుచిత్ర పాలాభిషేకం.

రామ్ గోపాల్ పేట మే 5,(జే ఎస్ డి ఎం న్యూస్) :
పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయాల పట్ల రాంగోపాల్‌పేట డివిజన్‌లో మాజీ కార్పొరేటర్ చీరె సుచిత్ర శ్రీకాంత్ ల ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చిత్ర పటానికి బి జె పి శ్రేణులు పాలాభిషేకం చేశారు.మిఠాయిలు పంచుకుని,టపాకాయలు కాల్చారు. మంగళవారం రాంగోపాల్‌పేట డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం నుండి బీజేపీ నాయకురాలు చీర సుచిత్ర శ్రీకాంత్ ఆధ్వర్యంలో భారీ విజయ ప్రదర్శన (ర్యాలీ) నిర్వహించారు. బెంగాల్ గడ్డపై తొలిసారి కమలం వికసించడం, అస్సాంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.ఈ సందర్భంగా మోదీ నాయకత్వానికి అనుకూలంగా, జై భారత్ మాతా అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఈ విజయ యాత్రలో సీనియర్ నాయకులు ఎస్.ఆర్ మల్లేష్, ఎస్. మనోహర్, డాక్టర్ రామ్ వెంకట్, డి.ఆర్ శ్రవణ్, సూర్యవంశీ ప్రవీణ్, ఆనంద్ వ్యాస్, గోపి కిషన్ జీ పాల్గొని కార్యకర్తలనుఉత్సాహపరిచారు. ఈ గెలుపు దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు, సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని చీరె సుచిత్ర కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నరేంద్రపాల్, మహేష్, అశ్విని, మదన్, సతీష్, యాదగిరి, శ్రీధర్, జహంగీర్, అరుణ్, ధనరాజ్, పాల్సే మాజీ, సంకేత్ మాజీ, నాగార్జున, కుమార్, అభినవ్, నిపుణ్, విజయ్, అరుణ్ వి, బి. సంతోష్, హరి, సత్తి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *