బేగంపేట మే 7
(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఈనెల 10వ తేదీన జరగనున్న ప్రధాని మోడీ సభను విజయవంతం చేయాలనీ రాంగోపాల్‌పేట మాజీ కార్పొరేటర్ చీరె సుచిత్ర శ్రీకాంత్ మహిళలకు సూచించారు. గురువారం ఆమె డివిజన్ పరిధిలోని చుట్టల బస్తీలో పర్యటించి మహిళలను కోరారు.ప్రధానిగా మరోసారి నగరానికి వస్తున్న పి ఎం కు ఘన స్వాగతం పలకాలన్నారు.ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి వచ్చి సభను విజయవంతం చేయాలనీ కోరారు.
హమాలీ లతో కల్సి భోజనం చేసిన చీరె ….
ప్రధాని మోడీ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరుతూ బిజెపి సీనియర్ నాయకులు చీర సత్యనారాయణ శ్రీకాంత్ కోరారు. గురువారం ఆయన మహంకాళి క్లాత్ మార్కెట్ హమాలీ సంఘం వద్దకు వెళ్లి వారితో కలిసి భోజనం చేశారు. వారు వడ్డించిన భోజనాన్ని వారితో కలిసి నేలపై కూర్చొని రుచి చూసారు. ప్రధాన మోడీ సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ తో పాటు మదన్ ,హమాలీలు పాల్గొన్నారు.


