ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ కుర్మ హేమలత.

సికింద్రాబాద్ మే 7,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగానియోజకవర్గవ్యాప్తంగా పోలింగ్ బూతుల వద్ద హెల్ప్ డెస్క్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బన్సీలాల్ పేట స్టెప్ వెల్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ కేంద్రాన్ని బన్సీలాల్ పేట మాజీ కార్పొరేటర్ కుర్మ హేమలత గురువారంసందర్శించారు. అక్కడ బూత్ లెవల్ అధికారులు (BLO) నిర్వహిస్తున్న ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల ప్రక్రియను ఆమె స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో సిబ్బంది ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండానిష్పక్షపాతంగావ్యవహరించాలని సూచించారు. బోగస్ ఓట్లను ఏరివేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ను కల్పించేలా బాధ్యతగా పనిచేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, నిజమైన ఓటర్ల వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు కుర్మ లక్ష్మీపతి, ఫహీం, సీమా,సాజిద్, ఖలీద్, శ్రీశైలం యాదవ్, సాహబుద్దీన్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *