హైదరాబాద్ మే 7,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఈనెల 10వ తేదీన పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తో కలసి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లు, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా చర్యలపై నాయకులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ
కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ జాతీయ బీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ , బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మండలి పక్ష నేత ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్సీలు మల్కా కొమురయ్య, అంజి రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


