తాళ్లూరు మండలానికి
చెందిన సీనియర్ నాయకుడు, వ్యాపారవేత్త ఐవీ రెడ్డి తండ్రి ఇడమకంటి చిన కోటిరెడ్డి (ఐ. సి రెడ్డి (చిత్రపటానికి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నివాళులర్పించారు. చిన కోటిరెడ్డి రెండు రోజుల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. అదేరోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఐసి రెడ్డికి నివాళులర్పించారు. ఆరోజు డాక్టర్ బూచేపల్లి అందుబాటులో లేకపోవడంతో శనివారం తాళ్లూరులో వారి నివాసానికి వెళ్లి ఐవీ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. తొలుత చిన కోటిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. తాళ్లూరు అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
నివాళులర్పించిన వారిలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు టివి సుబ్బారెడ్డి , జిల్లా పార్టీ సెక్రటరీ మారం ఇంద్రాసేనారెడ్డి, జిల్లా ప్రచార కమిటీ కార్య దర్శి గూడా గోపాల్ రెడ్డి, జిల్లా మైనారిటీ సభ్యులు షేక్ కాలేషా, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు , ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్,మాజీ సర్పంచ్ షేక్ వలి, మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు కైపు అశోక్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు నుసుం నాగార్జునరెడ్డి, నాయకులు కోట కృష్ణారె డ్డి, కోట మన్నేరెడ్డి,యానం గోపీకృష్ణ, తూము బాలకృష్ణ, కోట బ్రహ్మారెడ్డి, మణికిరణ్ ఉన్నారు.


