కేటాయించిన ఎరువులను అవసరమైన మేర వినియోగించాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. తాళ్లూరులో ఎరువుల దుకాణాలను ఆయన సోమవారం పరిశీలించారు. రైతులు రసాయన ఎరువులను మోతాదు మించి వినియోగిస్తున్నారని, అధిక మోతాదులో ఎరువులు వేస్తేనే పండుతాయన్న అపోహను వీడాలని రైతులను అవగాహన కల్పించాలని చెప్పారు.
