బేగంపేట మే 12,(జే ఎస్ డి ఎం న్యూస్) : తెలంగాణ విద్య వారోత్సవాల్లో బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రొఫెసర్, విద్యార్థినిలకు గుర్తింపు లభించింది.తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మృదుల కు పదివేల ప్రోత్సాహక చెక్ అందజేయగా, రైఫిల్ షూటింగ్ లో నాలుగవ స్థానంలో నిలిచిన అంతర్జాతీయ షూటర్ బానోతు పవనికి లక్ష రూపాయల చెక్ ,ల్యాప్ టాప్ ను అందజేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఈనెల 11 నుంచి 17 వరకు విద్యా వారోత్సవాలను ఘనంగా ప్రారంభించింది. 2024 లో ఉత్తమ ఫ్యాకల్టీ అవార్డు గ్రహీత, రాష్ట్రపతి అవార్డు పొందిన తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మృదుల కు ప్రభుత్వం ఉపాధ్యాయుల రూపాయల ప్రోత్సాహక చెక్ ను అందజేశారు. అదేవిధంగా ఆల్ ఇండియా రైఫుల్ షూటింగ్ లో నాలుగవ స్థానంలో నిలిచిన అంతర్జాతీయ పారాషూటర్ బానోత్ పవన్ కి ఆమె ప్రతిభను ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల ప్రోత్సాహక చెక్కును అందజేసింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అప్పియ చిన్నమ్మ, వైస్ ప్రిన్సిపల్ టి భాస్కర్ రెడ్డి లు మాట్లాడుతూ ఈ పురస్కారాలు తమ కళాశాల క్రమశిక్షణకు నిరంతర అభ్యాసానికి నిదర్శనమని హర్షం వ్యక్తం చేశారు ఐక్యూ ఏసి కోఆర్డినేటర్ అన్ని షరాన్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సంధ్య జ్యోత్స్న, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దినేష్ శుక్ల ఇతర సిబ్బంది విజేతలను అభినందించారు. బేగంపేట మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సాధించిన ఈ విజయాల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

