కంటోన్మెంట్ మే 12(జే ఎస్ డి ఎం న్యూస్) :
హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ పరిధి లోనిబ్ వివిధ ఆలయాల్లో ఘనంగా పూజలు,హోమాలు,యఙ్గలు నిర్వహించారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ఒకటవ వార్డు పెద్ద తోకట్ట దాసాంజనేయ స్వామి ఆలయం, ఆరో వార్డ్ సీతారాంపురం కాలనీ లో ని శివ పంచాయతన హనుమాన్ దేవాలయం ప్రత్యేక పూజలు చేసి, మణిసూక్తి యజ్ఞం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జంపన కు పూల మాల వేసి , తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సాయి బాబా యాదవ్, ప్రకాష్, విజయ్, శ్రీకాంత్ రెడ్డి, గోవర్ధన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.


