తూర్పుగంగవరంలో బుధవారం స్వచ్ఛ పథకం కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ,
అజిత, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస రావు, సొసైటీ చైర్మన్ వల్లభనేని సుబ్బయ్య, జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం వైఎస్ఆర్ కే ప్రసాద్, పంచాయితీ అభివృద్ధి అధికారి డి మల్లేశ్వరి గూడ పుల్లా రెడ్డి, జాస్తి హనుమంత రావు, సోమా సుబ్బా రావు, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొని స్వచ్ఛత ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. పాఠశాల గోడ వెంబడి ఉన్న చెత్తను తొలగించారు.
