లక్కవరంలో ఎప్రియల్ 28న మండల కాంగ్రెన్ పార్టీ అధ్యక్షుడు కూకట్ల వీర బ్రహ్మంకు చెందిన కంటైనర్ హౌస్ ప్రమాద వశాత్తు అగ్నికి ఆహుతైనది. అగ్ని ప్రమాదంలో బాధితుడు కూకట్ల వీర బ్రహ్మం బారీ మొత్తంలో రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లి కట్టు బట్టలతో మిగిలాడు. శనివారం రెవిన్యూ ఇన్స్పెక్టర్ సుధీర్ సంఘటన స్థలాన్ని, కంటైనర్ ను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసారు. ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు చెప్పారు.

